Sri Matrukachakra viveka    Chapters   

శ్రీ మాతృకాచక్రవివేకము

శ్రీ స్వతంత్రానందనాథుని రచన మాతృకాచక్ర వివేకము. ఈ ఉత్తమ గ్రంథమును నాగరాక్షరములతో అరువది ఏండ్లక్రితము ప్రచురించినారు. అది ఇప్పుడు లభ్యము కాదు.

మాతృకలనగా ఏబది అక్షరములు. ఇవే పంచాశత్‌ పీఠములని సహస్రనామములలో కలదు. ఇవి శ్రీ చక్రమున ఇమిడియున్నవి. ఈ గ్రంథమునంత మాత్రమున శాక్తాద్వైత పరమనిగాని, శివాద్వైతపరమనిగాని భావించ వీలులేదు. మాండూక్యమున గల జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయా తీతములను వివేచించి, ఈ అవస్థలను శ్రీ విద్యాపరముగా సమన్వయము చేయుట వలన ఈ గ్రంథము శ్రేష్ఠమైనది.

కొంత గ్రంథమునకే టీకనిచ్చితిని. అవే పదములు పునరావృత్తములగుటచే శేషించిన శ్లోకములకు వివరణను మాత్రమే ఇచ్చితిని.

ఈ గ్రంథప్రచురణకు ద్రవ్యసహాయము నిచ్చిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారికి నా కృతజ్ఞతలు. ఇట్టి గ్రంథముల ప్రచురణకు చేయూతనిచ్చుచున్న శ్రీదేవ స్థానమువారు చిరస్మరణీయులు.

దీనిని సర్వాంగసుందరముగా స్వల్ప కాలముననే ప్రచురించిన సాధన గ్రంథ మండలి వ్యవస్థాపకులగు బ్రహ్మశ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారికి నా ధన్యవాదాలు.

గ్రంథకర్త

నివేదన

శ్రీ మాతృ కాచక్ర వివేకము

ప్రణమామి మహాదేవీం మాతృకా పరమేశ్వరీం |

కాల హల్లోహలోల్లోల కలనాశమకారిణీం ||

విద్వద్వరిష్టులు బ్ర.శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు. సంస్కృతాంధ్రములయందు విద్వచ్ఛిరోమణులబుద్ధులసైత మెచ్చట ప్రవేశింపజాలక నిలిచిపోవునో అట్టి తావులందు 'నల్లేరుపై బండి నడకమాకు' అనుచు నిరాఘాటముగ 'నహిప్రతిగా' నిర్దుష్ట వైఖరిని సాగిపోవు శ్రీశాస్త్రిగారి బుద్ధివైభవము వైదుష్యము సర్వదేశ ప్రసిద్ధములు.

ఈ మాతృకాచక్రవివేకము సంస్కృతమున శ్రీ స్వతంత్రానందనాథులచే రచింపబడినది. 'వటకణికాయ మివవృక్షః' అన్నట్లు - సర్వవేదాంతసారమును, సృష్టి స్థితి లయములను, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులను - బ్రహ్మ, విష్ణు మహేశులను - అన్నిటిని మాతృకయందే వారు చూపించినారు. 'మాతృత్వాత్‌ సర్వశాస్త్రాణాం మాతృకేతి నిగద్యతే' సర్వశాస్త్రములకు జననియగుటచే అక్షర సమామ్నాయమునకు ఆదిక్షాంతవర్ణ సముదాయమునకు 'మాతృక' అని పేరు. మాతృకలు శ్రీచక్రమున ఇమిడి యున్నవి. ఇవే పంచాశత్పీఠములు.

శ్రీ స్వతంత్రానందనాథులవారు తమ గ్రంథమున మాతృక ఇట్లున్నది కనుక జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు అట్లు ఏర్పడుచున్నవని, బ్రహ్మ, విష్ణు, మహేశాను లట్లున్నారు గనుక మాతృక ఇటు లేర్పడినదనియు - సర్వమునకు మాతృక కారణము సర్వము మాతృకకు కారణము అని మాతృకకు చాల నిగూఢమైన పండిత సమ్మతతమైన విద్వజ్జనైక వేద్యమైన మహార్థమును నిర్వచించియున్నారు.

సంస్కృతభాషయందున్న యీ గ్రంథము ఎవరో కొలదిమంది పండితులకు మాత్రమే తనలోని అనర్ఘ విషయ రత్నములను వెల్లడించుచుండగా - ఇట్లు కాదని దీనిని ఆంధ్రీకరించి సాధారణులు సైతము ఇందలి విషయమును గ్రహించి మేలొందవలెనని శ్రీశాస్త్రిగారు దీనిని ఆంధ్రీకరించినారు. ఆంధ్రీకరించుటయే కాదు. శ్రీ శాస్త్రిగారీ గ్రంథమును ఆంగ్లీకరించినారు. ఆంగ్లమున ముద్రణ జరుగుచున్నది.

ఈ గ్రంథము 'మంత్రాలకు చింతకాయలు రాలుతాయా' అనే వారికి 'ఔను-రాలుతాయి. ఇలారాలుతాయి ఈ కారణంగా ఆసామర్థ్యం మంత్రానికి ఏర్పడుచున్నది. అవే వివేకం కలిగిస్తుంది.

మా మండలి తరపున శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి కృతజ్ఞతాభివందనము లర్పించున్నాము. సాధక పాఠకుల కీగ్రంథము పరమోప కారము కాగలదు. అచిరకాలములో సర్వాంగసుందరముగా ముద్రించిన స్వర్ణలక్ష్మీ ప్రింటర్సు, తెనాలి వారికి మా కృతజ్ఞతలు.

అక్షయ ఇట్లు

హేమంతము బులుసు సూర్యప్రకాశశాస్త్రి

వ్యవస్థాపకుడు : సాధన గ్రంథమండలి

శ్రీ చక్రమ్‌

శ్రీ లలితా పంచకమ్‌

శ్లో|| ప్రాతః స్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం |

ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం ||

శ్లో|| ప్రాత ర్భజామి లలితా భుజకల్పవల్లీం

రక్తాంగుళీయ లసదంగుళ పల్లవాఢ్యాం |

మాణిక్య హేమవలయాంగద శోభమానాం

పుండ్రేక్షు చాపకుసుమేషు సృణీ ర్దధానాం ||

శ్లో|| ప్రాత ర్నమామి లలితా చరణారవిందం

భ##క్తేష్టదాన నిరతం భవసింధుపోతం |

పద్మాసనాది సురనాయక పూజనీయం

పద్మాంకుశ ధ్వజసుదర్శన లాంఛనాఢ్యం ||

శ్లో|| ప్రాత స్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యంతవేద్య విభవాం కరుణా నవద్యాం |

విశ్వస్య సృష్టివిలయస్థితి హేతుభూతాం

విశ్వేశ్వరీం నిగమవా జ్మనసాతి దూరామ్‌ ||

శ్లో|| ప్రాత ర్వదామి లలితే తవపుణ్యనామా

కామేశ్వరీతీ కమలేతి మహేశ్వరీతి |

శ్రీశాంభవీతి జగతాం జననీపరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||

శ్లో|| యశ్ల్శోకపంచక మిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |

తసై#్మ దదాతి లలితాఝడితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్య మనంతకీర్తిం ||

ఇతి శ్రీశంకరాచార్యకృత శ్రీ లలితా పంచకం సంపూర్ణమ్‌

శ్రీమాతృకాచక్ర వివేక ప్రకారేణ బిందువ్యాప్తం షట్త్రింశత్‌ తత్త్వనిర్ణయఃక్షకారాది కకారాంతవర్ణైరితివిజ్ఞేయం:

1 క్షం ళం 2హం 3 సం 4 షం 5 శం 6 ఏం

శివః శక్తిః సదాశివః ఈశ్వరః శుద్ధవిద్యా మాయా

క్షః ళః 36 హః 35 సః 34 షః 33 శః 32 ఏః 31

లం 8 వం 9లం 10 రం 11 యం 12 మం

నియతిః కాలః రాగః అవిద్యా కలా పురుషః

లః 30 వః 29 లః 28 రః 2 యః 26 మః 25

13 భం 14 బం 15 ఫం 16 పం 1నం 18 ధం

మనః బుద్ధిః అహంకారః ప్రకృతిః శ్రోత్రం త్వక్‌

భః 24 బః 23 ఫః 22 పః 21 నః 20 ధః 19

19 దం 20 థం 21 తం 22 ణం 23 ఢం 24 డం

చక్షుః జిహ్వా ఘ్రాణం వాక్‌ పాదౌ పాణి

దః 18 థః 1 తః 16 ణః 15 ఢః 14 డః 13

25 ఠం 26 టం 2ఞం 28 ఝం 26 జం 30 ఛం

ఉపస్థః పాయుః శబ్దం స్పర్శః రూపం రసః

ఠః 12 టః 11 ఞః 10 ఝః 9 జః 8 ఛః

31 చం 32 ఙం 33 ఘం 34 గం 35 ఖం 36 కం

గంధః ఆకాశః వాయుః వహ్నిం జలం పృథివి

చః 6 ఙః 5 ఘః 4 గః 3 ఖః2 కః 1

Sri Matrukachakra viveka    Chapters